నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి ఆకులతో పూజ జరిపారు. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు..పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి..