రామచంద్రపురం మండలం, వెంకటాయ పాలెం లో బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజవర్గ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సూర్య ప్రకాష్ మాట్లాడుతూ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.