మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని AP రైతుసంఘం జిల్లా అధ్యక్షులు BH రాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ లకు గురువారం వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు పండించిన మొక్కజొన్నలు రోడ్లు కల్లాలో ఉందని రాయదుర్గం తహసీల్దార్ కు వినతిపత్రం ఇస్తూ వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు, సిపిఎం నేతలు పాల్గొన్నారు.