పి 4 లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అదనపు కమిషనర్ సుధాకర్ పిలుపు
అడిషనల్ కమిషనర్ P4 సమావేశం... ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని,ఆ యొక్క లక్ష్యసాధనకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ పేర్కొన్నారు.కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశపు హాల్లో సచివాలయ సెక్రెటరీలకు పి4 పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థికంగా పునరుద్ధరించడానికి పీ-4 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3 వేల మంది మార్గదర్శులుగా గుర్తించామని, 6వేల పై పడి బంగార