పెందుర్తి: ఇంజనీరింగ్ విద్యార్థి కనిపించట్లేదని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
చినముషిడివాడ, బండి కొండ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో తన పెద్ద కుమారుడు బడిగంటి కోశిక్ కుమార్, వయస్సు 20 సంవత్సరాలు, కనిపించట్లేదని మంగళవారంఫిర్యాదు చేశారు , విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో B-Tech పూర్తిచేసి, నరవలో ఉంటున్నాడు. మే 25 తారీఖున మధ్యాహ్నం 2:00 గంటలకు హాస్టల్‌ను వదిలి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన తరువాత, ఇప్పటివరకు ఇంటికి చేరలేదు. అతని ఆచూకీ తెలియకపోవడంతో, కనిపించట్లేదని పెందుర్తిపోలీసులకు ఫిర్యాదు చేశారు