రాయదుర్గం: డి.హిరేహాల్ లో చలి కాచుకుంటూ మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
డి.హిరేహాల్ మండల కేంద్రంలో చలిమంట కాచుకుంటూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వివరాల మేరకు గ్రామానికి చెందిన సిద్దేశ్ నవంబర్ 30 న చలిమంట కాచుకుంటుండగా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.