చెత్త ఏరుకునేవారి సంకేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నమస్తే ప్రొఫైలింగ్ క్యాంపు ను రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ఉదయం పట్టణంలోని 8 వ సచివాలయం వద్ద హసిరుదళ కో ఆర్డినేటర్ నాగరత్న, మున్సిపల్ శ్యానిటరీ ఇనిస్పెక్టర్ రవీంద్ర యాదవ్ తో కలిసి చెత్త, గుజరి ఏరుకుని జీవనం సాగించే వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేస్ పిక్కర్స్ కార్డులు మంజూరు చేసి వారి సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వివరాలను నోడల్ ఆఫీసర్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేయబడుతాయని వారు తెలిపారు.