అగ్ని ప్రమాద బాధితులకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చేయూత
*అగ్ని ప్రమాద బాధితులకు సానా సతీష్ బాబు చేయూత* కాకినాడ రమణయ్యపేట శివారు సిద్ధార్థ నగర్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో శ్రీను అపర్ణ దంపతుల గుడిసె పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం నిరాశ్రయులైంది. ఈ ఘటనను మాజీ జడ్పిటిసి కాకరపల్లి చలపతిరావు, సత్యవతి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తికి సమాచారం అందించారు. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, బాధిత కుటుంబానికి ₹5,000 నగదు సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తు