ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయని పేటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కాలేజీ లను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందని దీనివల్ల పేదలు ఉచిత వైద్య విద్యతోపాటు వైద్యం కోల్పోతారని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ ని కలిసి మెడికల్ కళాశాలలనూ ప్రైవేటీకరణ చేయడానికి అడ్డుకుంటామని అన్నారు.