అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా దర్శి, కొండేపి, ముండ్లమూరు, కందుకూరు టౌన్,గుడ్లూరు,మేదరమెట్ల,వివిపాలెం, ఒంగోలు టూ టౌన్, నాగులప్పలపాడు, లింగసముద్రం, ఉలవపాడు మరియు మార్కాపురం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను సందర్శించిన విద్యార్థినిలకు పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులు, మహిళా సహాయ కేంద్రం సేవలను గురించి తెలిపారు