తిరుపతి జీవకోన సత్యనారాయణపురంలో రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది వర్షాలు మొదలవుతున్న వేళ పాడైపోయిన రోడ్లు డ్రైనేజీ కారణంగా ఇళ్లలోకి నీరు రావచ్చని ఆందోళన స్థానికుల్లో నెలకొంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నేతలు ప్రజలతో కలిసి సమస్యలపై స్పందించారు జీవకోన ప్రాంతాన్ని సందర్శించి రోడ్ల పరిస్థితిని పరిశీలించారు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.