కిష్టారావుపేట గ్రామ సమీపంలో, ట్రాక్టర్ బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని కిష్టారావుపేట గ్రామ కిష్టారావుపేటసమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వసీం అక్రమ్ నే వ్యక్తి మృతి, వివరాల్లోకి వెళితే ఆత్మకూరులో ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వసీం అక్రమ్ విధులు ముగించుకొని ఆత్మకూర్ నుంచి తన స్వగ్రామమైన కర్నూలుకు వెళుతుండగా కిష్టారావుపేట గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో వసీం అక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడు, పాములపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు