రాయదుర్గం: నాగలాపురం సమీపంలో హెచ్ఎల్సీ ప్రధాన కాలువకు గండి, వృదా గా పోతున్న నీరు
డి.హిరేహాల్ మండలంలోని నాగలాపురం సమీపంలో హెచ్ఎల్సీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున నీరు వృదా గా పోతోంది. హెచ్ఎల్సీ 113/557 కిమీ వద్ద అండర్ టన్నెల్ సెడ్ వాల్ దెబ్బతిని కూలిపోయింది. ఉదయమే గమనించిన స్థానిక రైతులు అధికారులకు సమాచారం అందించారు. హెచ్ఎల్సీ ప్రధాన కాలువ గట్లు పలుచోట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.