ఆలమూరు గ్రామంలో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్,5బైకులు,21750 నగదు స్వాధీనం, సిఐ రాము
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో ఆదివారం ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ సీఐ రాము ఆదివారం తెలిపారు, వీరి వద్ద నుంచి 21,750 రూపాయల నగదు,5 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రాము తెలిపారు, ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచి పేకాట రాయుళ్లను గుర్తించినట్లు వివరించారు, అప్డేట్ టెక్నాలజీతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాము హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు