శెట్టిపల్లి ప్రధాన పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం, విచారణ చేపట్టిన పోలీసులు
అమలాపురం రూరల్ మండలం, శెట్టిపల్లి ప్రధాన పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నీటి తేలుతున్న మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అమలాపురం రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు పర్యవేక్షణతో కాలువ నుండి మృతదేహాన్ని బయటకు తీసారు. ఎవరైనా వ్యక్తులు కనిపించకపోతే సంప్రదించాలని పోలీసులు కోరారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.