ఇటీవల ఒంగోలు కోర్ట్ సెంటర్ వద్ద ఆటో ఎక్కి ప్రయాణించి దిగేటప్పుడు తన విలువైన బ్యాగును మర్చిపోయి వెళ్లారు. ఆ ఆటోను నడిపిన ఒంగోలు బాలాజీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గద్దె నాగేశ్వరరావు ఆ బ్యాగును గుర్తించి వెంటనే ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ బ్యాగులో సుమారు రూ.30 లక్షల విలువ గల బంగారం మరియు నగదు ఉన్నాయి. అలాగే ఒంగోలు బిలాల్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఖలీల్ వెంకటేశ్వర కాలనీ నుండి ప్రయాణికులను ఎక్కించుకుని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వరకు వారిని దించారు. ప్రయాణికులు దిగిన తర్వాత ఆటో వెనుక భాగంలో ఉన్న బ్యాగును మర్చిపోయి వెళ్లారు.