నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పడమర పాతకోట గ్రామంలో తిరునాళ్లకు వచ్చిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కేసీ కెనాల్ లో పడి గల్లంతైన ఘటన పడమర ప్రాతకోట గ్రామంలో చోటు చేసుకుంది, ముచ్చుమరి ఎస్సై నరేంద్ర తెలిపిన వివరాల ప్రకారం గడివేముల గ్రామానికి చెందిన అచ్చన్న గౌడ్ అనే వృద్ధుడు తన మనవరాలు ఇంటికి జాతరకు వచ్చారు, ఉదయం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కేసీ కెనాల్ కాల్వలో పడి గల్లంతయ్యాడు, అచ్చన్న ఆచూకీ కోసం కేసీ కెనాల్ వెంట గాలింపు చర్యలు చేపట్టారు