మురమళ్ళ లో పంట కాలువ ఆక్రమణలపై రైతుల ఆందోళన, సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే దాట్ల కు వినతి పత్రం అందజేత
ఐ పోలవరం మండల, మురమళ్ల నుండి గుత్తెనదీవి గ్రామం వరకు గల ప్రధాన పంట కాలువ ఆక్రమణ గురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల పంట కాలువ ఆక్రమణలకు గురవడంతో మురమళ్ల, కొమరగిరి, ఎదురులంక, పాత ఇంజరం, జి.మూలపాలెం గ్రామాలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కు ఈ సమస్యను వివరించారు. ప్రధాన పంట కాలువపై ఆక్రమణలు తొలగించాలని రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు