' మీకోసం ' అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ' మీకోసం ' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ. డి. హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, కళావతి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు.