ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఎత్తి వరద నీటి విడుదల, ఆందోళనలో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు
భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరిగి నీటిమట్టం 39 అడుగులకు చేరడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద క్రమేపి పెరుగుతూ ఉండడంతో సోమవారం అప్పనపల్లి స్నాన ఘట్టం వద్ద సోమవారం మూడు మెట్లు మునిగి పోయాయి. దీంతో ఇక్కడ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పెదపట్నం మధ్య లంక, పెదపట్నంలంక గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ మళ్లీ పశుగ్రాసం మునిగి పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.