కాకినాడలో కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 20వ తేదీ సెప్టెంబర్ 2025న కాకినాడ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ప్రాంగణం వద్ద విద్యుత్ కార్మికులచే రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు వారికి మద్దతుగా సుమారు 150 మంది తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం ఇంతకుముందే అంగీకరించినప్పటికి క్షేత్రస్థాయిలో అమలు చేయని పలు డిమాండ్ల సాధన కొరకు ఈ దశల వారి ఆం