కణేకల్లులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా శనివారం వైఎస్సార్ విగ్రహం వద్ద రోడ్డుపై వైసిపి శ్రేణులు బైటాయించి నిరసనకు దిగారు. విగ్రహం ద్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఆపార్టీ నేతలు ఉపేంద్రారెడ్డి, ఉషారాణి, జడ్పీటీసీ పద్మావతి, పార్టీ నేతలు బ్రహ్మానందరెడ్డి మారెన్న, జయరామిరెడ్డి, కేశవరెడ్డి, మాధవరెడ్డి, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.