తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఆర్జిదారుల నుండి ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, రోజ్ మాండ్ లతో కలసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.