పెబ్బేరు: సంక్షేమ పథకాల సర్వే త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించే సర్వేను ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు అదనపు కలక్టర్ పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల్లో పర్యటించి తనిఖీ చేశారు. అర్హులైన రైతు కుటుంబాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు జి.పి.ఎస్, జియో ట్యగింగ్ యాప్ ల ద్వారా వ్యవసాయ యోగ్యం లేని భూములు అనగా లే అవుట్ ప్లాట్లు, ఇరిగేషన్, రోడ్డు కొరకు సేకరించిన భూములు, ఇప్పటికే ఇళ్ళు నిర్మించుకున్న స్థలాలు, పారిశ్రామిక స్థలాలను గుర్తించి రైతు