పెందుర్తి: చెరువుని తలపిస్తున్న నగర మేయర్ పీలా శ్రీనివాసరావు 96వ వార్డ్ బాలాజీ నగర్ కాలనీ
జీవీఎంసీ నగర మేయర్ పిలా శ్రీనివాసరావు 96వ వార్డు పెందుర్తి ప్రశాంతి నగర్ సమీపంలో గల బాలాజీ నగర్ లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కాలనీ జలమయం అయ్యింది. కాలనీ రోడ్లు నీటితో నిండిపోయాయి. ఇంట్లోంచి బయటికి రాలేనే పరిస్థితి ఎదురయింది ఆ కాలనీ ప్రజలకు. ఈ దుస్థితి నుంచి తమ రక్షించాలని కాలనీ ప్రజలు జీవీఎంసీ అధికారులను కోరుతున్నారు. ఏళ్ల తరపున ఇదే పరిస్థితి నెలకొంది బాలాజీ నగర్ కాలనీ వాసులకు సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడమే దీని కారణం