కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం లోకి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నట్లు లోయర్ మానేరు డ్యాం అధికారులు శుక్రవారం తెలిపారు. లేక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్యాం కట్టపై బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని సమీక్షిస్తున్నారు.మిడ్ మానేరు డ్యాం నుంచి 35 వేల క్యూసెక్కులు నీరు ఎల్ఎండిలోకి వస్తుందని, మోయ తుమ్మేంత వరద ప్రవాహం ద్వారా 17,230 కి క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఇన్ఫ్లోగా 52,230 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు తెలిపారు. మొత్తం లోయర్ మానేరు డ్యాం నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19 టీఎంసీల వద్ద నీటి నిలువ కొనసాగుతుందని తెలిపారు.