జాతీయ రహదారిపై ఘోరం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని 70 గొర్రెలు మృతి ప్రభుత్వం ఆదుకోవాలని గొల్ల కురుమల ఆవేదన మూగజీవులపై గుర్తుతెలియని వాహనము వెళ్లడంతో 70 గొర్రెల వరకు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండల పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్రాస్పేట్ మండల పరిధిలోని నాందార్ పూర్ గ్రామానికి చెందిన మల్కప్ప,ఎల్లప్పకు చెందిన 70 గొర్రెలు గుర్తు తెలియని వాహనం ఢీకొనడం జరిగిందన్నారు. మృతి చెందిన గొర్రెలను ఒక్కసారిగా చూసిన గొర్రెల యజమానులు కన్నీటి