శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం పులమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులందరికీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 17 మంది విద్యార్థులు కొంతవరకు కంటి లోపం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీరికి ప్రభుత్వం ద్వారా కంటి అద్దాలను త్వరలో అందించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరికృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పఠాన్ బాబాద్దీన్ ఖాన్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.