మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరించడం జరుగుతుందని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం వచ్చే నెల 2 న వార్డు, గ్రామ పంచాయతీల వారీగా ఫోటోతో కూడిన తుది ఓటరు జాబితాను వెల్లడిస్తామని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ