సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో బుధవారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వినాయక చవితి పండగ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలువ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రానికి విఘ్నాలు తొలగించి శుభాలు చేకూర్చాలని అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతుల అభివృద్ధి చెందాలని విగ్నేశ్వరుని కోరుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అదేవిధంగా పెనుగొండ టిడిపి నేతలు ఆగస్టు 30న పెనుగొండలో పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పరిటాల సునీతను ఆహ్వానించడం జరిగింది.