బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద కృష్ణా నదిలో ఆదివారం రాత్రి గల్లంతైన తోడేటి హర్షవర్ధన్ అనే యువకుడి మృతదేహం మంగళవారం కొత్తపాలెం వద్ద లభ్యమైంది. చింతల్లంక గ్రామానికి చెందిన హర్షవర్ధన్ మృతదేహాన్ని కొల్లూరు మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు గుర్తించారు. హర్షవర్ధన్ మృతి దేహాన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం అధికారుల తరలించారు.