తుఫాను కారణంగా రాత్రి నుండి కురుస్తున్న వర్షంకి వాంబే కాలనీలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి రిటర్నింగ్ వాల్ కూలిపోయింది.65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వరస్వామి ఆలయం రిటైనింగ్ వాల్ కూలిపోయింది.ఆలయ పరిసరాల్లో ఉన్న వంటశాలతో పాటు, రేకుల షెడ్ కిందకి జారి పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు, ప్రమాదం తప్పిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.