మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో బల్దియ అధికారులతో కలసి కాలనీలో అయన పర్యటించారు. అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు విజ్ఞాపన పత్రం అందించారు.