రెబ్బెన మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఎన్టీఆర్ నగర్ కాలనీలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలనీలో వరద భారీగా వచ్చి చేరుతోంది. మరో గంట పాటు వర్షం కురుస్తే కాలనీలోని పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశం ఉంటుందన్నారు. దీంతో కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాన పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడుతోందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.