అచ్యుతాపురం మండలం పూడిమడక ఉప్పుటేరులో చేపలు చనిపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశించారు, పరిశ్రమల వ్యర్ధాలు ఉప్పుటేరులో కలపడం వల్లే చేపలు చనిపోయాయని స్థానికుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే విజయకుమార్ గురువారం అధికారులతో కలిసి ఉప్పుటేరును పరిశీలించి, మత్స్యకారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.