కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను గూర్చిగా చూపించి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరిస్తున్నాయని ఎన్సిపిఐయు జిల్లా కార్యదర్శి పెద్దాపురం రమేష్ గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఆరోపించారు. గురువారం గంగసాయిపేట ఏరియా డివిజన్స్ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ తాటికాయల రత్నం అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెద్దార రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగి ఎన్ని సంవత్సరాలు దాటిన వరంగల్ జిల్లాకు కనీసం జిల్లా కేంద్ర కార్యాలయాలు లేకపోవడం జిల్లా వెనుకబాటుతనానికి నిర్దర్శనం అన్నారు.