అనంతపురం జిల్లా నక్కలపల్లి వద్ద రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఆర్టీసీ కండక్టర్ రమేష్ అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివరాలను వెల్లడించారు. స్టీరింగ్ కట్ కాకపోవడంతో ఒక్కసారిగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో తనతోపాటు మరో మహిళకు గాయాలయ్యాయని తెలిపారు. బస్సులో 15 మంది ప్రయాణిస్తున్నారని తెలియజేశారు. రాయదుర్గం డిపోకు చెందిన బస్సు బెలుగుప్ప గుండ్లపల్లి మీదుగా అనంతపురం చేరుకోవాల్సి ఉందని తెలిపారు.