అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో శనివారం మండల తహశీల్దార్ అనిల్ కుమార్ అధ్యక్షతన పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ఎస్సై శివ ఎంపీడీవో లక్ష్మీనారాయణ లతో కలిసి స్థానిక ఆర్డిటి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులకు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని ఎస్సీ ఎస్టీలు అన్యాయం గురైతే పోలీసులను ఆశ్రయించాలని ఎస్సీ ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దగ్గర మౌనిక వైస్ ఎంపీపీ పుష్పావతి మాజీ సహకార సంఘం అధ్యక్షులు వెంకట నాయుడు పంచాయతీ సెక్రెటరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.