భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ ఎన్నికలను తలపించేలా టీఎస్ జెన్కో కార్మికుల కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా సాగింది. పాల్వంచలోని డీఏవీ స్కూల్‌లో పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. కార్మికులు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. పోలింగ్ కేంద్రం వద్ద కార్మికుడి ఐడెంటి కార్డు చేసి పోలింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.