జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామ శివారులో గల రాళ్లవాగు ప్రాజెక్టు శుక్రవారం పూర్తిగా నిండింది. వర్షాలకు వాగు ప్రాజెక్టు మత్తడి పైనుంచి నీళ్లు పారాడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రాళ్లవాగు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉంటే 3,500 ఎకరాలకు నీరందుతుందని రైతులు తెలిపారు. ఈసారి కాస్త ఆలస్యమైనా ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో తమ పంటలకు డోకా ఉండదంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.