చోడవరం సబ్ జైలు నుండి పరారైన ఇద్దరు ఖైదీలను 24 గంటల పై అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు, ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అరెస్టు చేసిన ఖైదీలను జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు, వీరితోపాటు వీరు జైలు నుండి పారిపోవడానికి ప్రేరేపించి, సహకరించిన ఏక స్వామి అనే ఖైదీ పై కూడా కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.