అన్నమయ్య జిల్లా.మదనపల్లె నియోజకవర్గం. రామసముద్రం మండలంలో గుప్త నిధుల ముఠా రెచ్చిపోయింది. ఆర్. నడింపల్లి పంచాయతీ.బల్లసముద్రం సమీపంలో కొండపై ఉన్న పురాతన వాలీశ్వరస్వామి ఆలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధులు కోసం ఆలయం వద్ద ధ్వంసం చేసిన సంఘటన సోమవారం వెలుగు వచ్చింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు . ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.