ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహిస్తున్న ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఏపీ ఫారెస్ట్ సభార్డినేట్ సర్వీసెస్ కు సంబంధించి ఈ నెల 7 వ తేదిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్,అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం.. ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10.00 గంటల నుంచి 12.30 వరకు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష 3.00pm నుంచి 5.30pm ఉంటుంది.