బీబీపేట్ మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పొలాల్లో ఇసుక తొలగించడానికి ఉపాధి హామీ పథకం కింద ఎం. సురేందర్, పిడి డిఆర్డిఏ కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం సర్వే నిర్వహించారు. ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఇవ్వబడుతుందని, జాబ్ కార్డు ఉండి సన్న, చిన్న కారు రైతులు ఉంటే వారికి ఈజీఎస్ లేబర్ ద్వారా పనులు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీఓ, టేక్ కేర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వీరంతా సర్వే నిర్వహించి, అంచనాలు తయారు చేసి మంజూరుకు పంపనున్నారు.