వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులు వారి పరిధిలో జరిగే వినాయక చవితి వేడుకల వద్ద మండప నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని టూ టౌన్ సి.ఐ సుబ్బారావు తెలిపారు. ప్రతి మండపం దగ్గర, ఆ మండపం కమిటీ వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి అలాగే మీ పరిధిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతూ సమాచారాన్ని పోలీస్ అధికారులకు తెలియచేయాలని సూచించారు.