కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేశారు.ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, చతుస్రనామార్చన, ద్వార తోరణ, అనంత కళా పూజ, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు.