చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించాడు. కింద పడి గాయపడిన 27 ఏళ్ల యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూనే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో, అతని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.