ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని జిల్లా అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే కంట్రోల్ రూం.8500844365 నంబర్ ను సంప్రదించాలని జిల్లా అధికారులు సూచించారు.