నవీపేట్ మండలంలోని బాలుర ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో సోమవారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) మేళా నిర్వహించారు. ఉపాధ్యాయులు తరగతి గది బోధనలో ఉపయోగించే వివిధ బోధనాభ్యసన సామగ్రిని (టీఎల్ఎం) ప్రదర్శించారు. ఎంఈఓ అశోక్ ఈ మేళాను ప్రారంభించారు. మండలంలోని 39 పాఠశాలలకు చెందిన ఉపాధ్యా యులు ఆకర్షణీయమైన టీఎల్ఎంను తయారు చేసి ప్రదర్శించారని ఆయన తెలిపారు.