కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఉదయం ప్రార్థన సమయానికి విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, వసతుల కల్పనలపై ప్రధానోపాధ్యా యులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయానికి విధులకు హాజరు అవుతున్నారా లేదా అనే విషయంపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం తీరుపై వివరాలు అడిగి తెలుసుకొని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.